అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

  • ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి
  • రేపు గుంటూరుకు వెళ్లనున్న జగన్
  • ఇప్పటికే అంబటి కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన వైసీపీ అధినేత
వైసీపీ అధినేత జగన్ రేపు గుంటూరులో పర్యటించబోతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ఫోన్ ద్వారా వారిని జగన్ పరామర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి, ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. మరోవైపు, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై కేసు నమోదయింది. ఈ కేసులో అంబటికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. 

Ambati Rambabu
Jagan
YSRCP
Guntur
Andhra Pradesh Politics
Chandrababu Naidu
TDP
Political Attack
Rajahmundry Jail

More Telugu News