చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు: భూమన కరుణాకర్ రెడ్డి

  • తిరుమల లడ్డూపై సిట్ రిపోర్ట్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న భూమన
  • స్వాములను భయపెట్టి లేఖలు రాయిస్తున్నారని మండిపాటు
  • రెడ్ బుక్ పాలన పెద్ద జీయర్ స్వామి వరకు వెళ్లిందని విమర్శ
తిరుమల లడ్డూపై సిట్ ఇచ్చిన రిపోర్ట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారని ఎద్దేవా చేశారు. అందుకే కొంత మంది స్వాములను భయపెట్టి చంద్రబాబు లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. పెద్ద జీయర్ స్వామితో బీఆర్ నాయుడు, ముద్దాడ రవిచంద్ర బలవంతంగా లేఖ రాయించారని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న క్షుద్ర రాజకీయ క్రీడలో ఆధ్యాత్మికవేత్తలు కూడా నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాములను భయపెట్టి చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. 

చంద్రబాబు రెడ్ బుక్ పాలన చివరకు పెద్ద జీయర్ స్వామిపైకి కూడా మళ్లిందని భూమన విమర్శించారు. కొంతమంది స్వాములకు భక్తి కంటే పైరవీలే ఎక్కువ అవసరమని అన్నారు. దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలపై ఎల్లో మీడియా దాడి చేస్తోందని మండిపడ్డారు. లడ్డూ అంశంలో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని సిట్ తన నివేదిలో స్పష్టం చేసిందని చెప్పారు. హైందవ సమాజానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Bhumana Karunakar Reddy
Chandrababu Naidu
Tirumala Laddu
YSRCP
SIT Report
Andhra Pradesh Politics
Political Criticism
TTD
Religious Leaders

More Telugu News