ఐఏఎస్ అధికారి డాక్టర్ నీలకంఠ రెడ్డిపై బదిలీ వేటు.. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి

  • ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ బాధ్యతల నుంచి ఉపసంహరణ
  • సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఆదేశం
  • ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి ఇన్‌ఛార్జ్‌ను నియమించాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక ఐఏఎస్ అధికారి బదిలీ అయ్యారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీఎస్‌ఏసీఎస్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. నీలకంఠ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన సేవలను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. తదుపరి పోస్టింగ్ ఇచ్చేవరకు సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖాళీ అయిన ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుకు అవసరమైన ఇన్‌ఛార్జ్ ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది.

Neelakanta Reddy
IAS officer
AP government
AIDS Control Society
AP SACS
transfer
G Sai Prasad
Andhra Pradesh
health department

More Telugu News