వారణాసి కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాల్చి చంపిన మరో విద్యార్థి!

  • పాత కక్షల కారణంగా మరో విద్యార్థి కాల్పులు
  • నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని తండ్రి డిమాండ్
  • ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కాలేజీ క్యాంపస్‌లోనే విద్యార్థిని మరో విద్యార్థి తుపాకీతో అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఉదయ్ ప్రతాప్ కాలేజీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బీఎస్సీ చదువుతున్న సూర్య ప్రతాప్ సింగ్ (23) అనే విద్యార్థిని, మంజీత్ చౌహాన్ అనే మరో విద్యార్థి హత్య చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు మంజీత్.. సూర్య ప్రతాప్‌పై దాదాపు 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కింద పడిపోయిన తర్వాత కూడా అతనిపైకి ఎక్కి మరీ కాల్పులు జరపడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఘటనతో కాలేజీ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన తోటి విద్యార్థులు ఫర్నిచర్‌ ను ధ్వంసం చేసి నిరసనలకు దిగారు. మరోవైపు, మృతుడి తండ్రి తన కుమారుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించారు. ‘‘నా కొడుకును చంపిన వాడిని ఎన్‌కౌంటర్ చేయాలి. అప్పుడే వాడి ఆత్మకు శాంతి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వారణాసి పోలీసులు ప్రధాన నిందితుడు మంజీత్ చౌహాన్‌ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రమేయమున్న ఇతరుల కోసం గాలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాలేజీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Varanasi college shooting
Uttar Pradesh crime
student murder
Surya Pratap Singh
Manjeet Chauhan
college campus violence
crime news
student conflict
gun violence
India crime

More Telugu News