ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ నిర్ణయం.. ఇజ్రాయెల్ ఏమన్నదంటే?

  • యుద్ధానికి ఐదు రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ వెల్లడి
  • యుద్ధ విరమణ అమెరికాకే పరిమితమన్న ఇజ్రాయెల్
  • తాము యుద్ధాన్ని విరమించలేదన్న ఇజ్రాయెల్
ఇరాన్‌తో యుద్ధాన్ని ఐదు రోజుల పాటు విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించింది. యుద్ధ విరమణ అమెరికాకే పరిమితమని స్పష్టం చేసింది. తాము యుద్ధాన్ని విరమించలేదని పేర్కొంది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో దాదాపు అన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది.

ట్రంప్ యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించినట్లు ప్రకటిస్తే, ఇజ్రాయెల్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించడం గమనార్హం. ఇరాన్‌తో రెండురోజుల పాటు చర్చలు జరిగాయని, ఈ చర్చలు సానుకూలంగా సాగాయని, ఈ నేపథ్యంలో యుద్ధానికి ఐదు రోజుల పాటు విరామం ఇస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో తదుపరి చర్చల ఫలితాల ఆధారంగా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

Donald Trump
Iran
Israel
US Iran conflict
Iran war
Hormuz Strait
Israel Iran war
Trump Iran negotiations

More Telugu News