ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి: ఐపీఎల్

  • పలు ఫ్రాంచైజీలలో ఆటగాళ్లకు గాయాలు, అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్లు
  • ఈ విషయం ఆయా ఫ్రాంచైజీలు చూసుకోవాలన్న ఐపీఎల్
  • అభిమానుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వెల్లడి
ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని లీగ్ వర్గాలు వెల్లడించాయి. ఆటగాళ్లకు గాయాలు, విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం వంటి అంశాలు ఆయా ఫ్రాంచైజీలు చూసుకుంటాయని తెలిపాయి. ఐపీఎల్ 2026 సీజన్ సమీపించింది. మార్చి 28 నుంచి మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పటికీ పలువురు విదేశీ క్రికెటర్లు తమ జట్లతో చేరాల్సి ఉంది. మరికొందరు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌పై పాలక వర్గాలు స్పష్టతనిచ్చాయి.

ఐపీఎల్‌లో విదేశీ క్రికెటర్లు ఆడే విషయంలో ఫ్రాంచైజీలతో తుది నిర్ణయమని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో పాలకవర్గం చేసేది ఏమీ ఉండదని తెలిపింది. కొందరు ఆటగాళ్లు గాయాల కారణంగా తమ జట్లతో కలవలేదని, ఇతర కారణాలతో మరికొందరు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని పేర్కొంది. ఈ అంశం ఫ్రాంచైజీలు చూసుకుంటాయని తెలిపింది. కానీ ఐపీఎల్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని తెలిపింది. క్రికెట్ అభిమానుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.

IPL
IPL 2024
Indian Premier League
IPL Schedule
Foreign Players
Cricket
BCCI
Franchise
Cricket Schedule

More Telugu News