మల్లారెడ్డి నిజాలు మాట్లాడుతారనుకుంటే మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారు: శ్రీధర్ బాబు కౌంటర్

  • మల్లారెడ్డి చెప్పిన సమస్యను దృష్టిలో ఉంచుకుంటామన్న శ్రీధర్ బాబు
  • ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని పరిశీలిస్తామని హామీ
  • నగరం నలుమూలలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామన్న మంత్రి
హైదరాబాద్‌లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మల్లారెడ్డి నిజాలు మాట్లాడుతారనుకుంటే, మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు అన్నీ చేశామని చెప్పారని, ఇప్పుడు మళ్లీ సమస్యలను లేవనెత్తుతున్నారని విమర్శించారు.

మల్లారెడ్డి చెప్పిన సమస్యను దృష్టిలో ఉంచుకుని, డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. నగరంలో నలుమూలలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఎమ్మెల్యే మల్లారెడ్డి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు సంబంధించి కొన్ని వాస్తవాలు చెప్పారని అన్నారు. కానీ ఆయన ముందు, వెనుక, పక్కన కూర్చున్న వారి ప్రభావంతో నిజాలు చెప్పడానికి బదులు సైడ్ ట్రాక్ అయ్యారని అన్నారు. డంపింగ్ కోసం నగరం చుట్టుపక్కల మరో మూడు ప్రాంతాలను ఎంపిక చేయాలనుకుంటున్నామని అన్నారు.

Malla Reddy
Sridhar Babu
Jawahar Nagar Dumping Yard
BRS
Telangana
Hyderabad
Dumping Yard Issue

More Telugu News