ప్రపంచకప్ విజయం తర్వాత.. సింగపూర్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్

  • టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత సింగపూర్‌లో గంభీర్
  • భార్యాపిల్లలతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న హెడ్ కోచ్
  • ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచకప్ గెలిచిన అరుదైన ఘనత
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన తర్వాత గౌతీ విరామం తీసుకున్నాడు. సింగపూర్‌లో తన భార్య నటాషా, కుమార్తెలు అజీన్, అనైజాతో కలిసి వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నాడు.

సింగపూర్ వీధుల్లో సాధారణ దుస్తుల్లో కనిపించిన గంభీర్, తన చిన్న కుమార్తెను భుజాలపై ఎక్కించుకుని నడుస్తూ కనిపించాడు.

2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న గంభీర్, ఇప్పుడు కోచ్‌గానూ కప్ సాధించి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ ద్రవిడ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ తర్వాత ఈ ఘనత సాధించిన కోచ్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన తర్వాతే గౌతీ భారత జట్టు హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు.

ఇక, టీమిండియా తదుపరి సిరీస్‌ జూన్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జరగనుంది. ఈ పర్యటనలో ఒక టెస్ట్, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది.

Gautam Gambhir
T20 World Cup 2026
Indian Cricket Team
Singapore Vacation
Natasha Gambhir
Kolkata Knight Riders
Rahul Dravid
Cricket Coach
Afghanistan Series

More Telugu News