ఎల్పీజీ పేరుతో అదనపు ఛార్జీ వసూలు చేయొద్దు: హెటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

  • ఎల్పీజీ గ్యాస్ కొరతపేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయన్న సీసీపీఏ
  • హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు, మీడియాలో కథనాలు వచ్చినట్లు వెల్లడి
  • అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న కేంద్రం
హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్పీజీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. గ్యాస్ కొరతను చూపిస్తూ అదనపు సేవల ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత పేరుతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీసీపీఏ స్పందించింది.

ఎల్పీజీ గ్యాస్ పేరుతో కొన్నిహోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు వచ్చాయని, మీడియాలో కూడా వార్తలు వచ్చాయని వెల్లడించింది. మెనూలో పేర్కొన్న ధరలను మాత్రమే వసూలు చేయాలని, అదనంగా ఎలాంటి చార్జీలు ఉండకూడదని స్పష్టం చేసింది.

Central Government
LPG
LPG Gas
Hotel Charges
Restaurant Charges
CCPA
Consumer Protection

More Telugu News