భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా.. 20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక

  • ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు
  • సంక్షోభ సమయంలో అండగా నిలిచిన అర్జెంటీనా
  • ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 50 వేల టన్నుల ఎల్‌పీజీ సరఫరా

ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వంటగ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ కూడా గ్యాస్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వంట గ్యాస్ రీఫిల్లింగ్ గడువును 35 రోజులకు పెంచడంతో వినయోగదారులకు ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. గ్యాస్ బుక్ చేసుకుందామంటో కస్టమర్ కేర్ సర్వీసులు కూడా సరిగా స్పందించని పరిస్థితి ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఇతర దేశాల వైపు చూస్తోంది. ఇందులో భాగంగా అర్జెంటీనా నుంచి ఎల్‌పీజీ దిగుమతులు రికార్డు స్థాయిలో పెరగడం గమనార్హం.


ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే (Q1) అర్జెంటీనా సుమారు 50 వేల టన్నుల ఎల్‌పీజీని భారత్‌కు సరఫరా చేసింది. ఇది రికార్డు స్థాయి వృద్ధిగా చెప్పుకోవచ్చు. 2025లో అర్జెంటీనా నుంచి వచ్చిన మొత్తం గ్యాస్ కేవలం 22 వేల టన్నులు మాత్రమే. అంటే ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే గత ఏడాది కంటే రెట్టింపు కంటే ఎక్కువ సరఫరా జరిగింది.


అర్జెంటీనాలోని బహియా బ్లాంకా పోర్ట్ నుండి గుజరాత్‌లోని దహేజ్ పోర్ట్‌కు మధ్య ఉన్న దూరం దాదాపు 20 వేల కిలోమీటర్లు. ఈ మార్గంలో ఒక ట్యాంకర్ రావడానికి 30 నుండి 35 రోజులు పడుతుంది (గల్ఫ్ దేశాల నుంచి అయితే 7-10 రోజులే పడుతుంది).

ఈ సందర్భంగా,లో భారత్‌ అర్జెంటీనా రాయబారి మరియానో అగస్టిన్ కాసినో ఈ పరిణామాలపై సంతోషం వ్యక్తం చేశారు. కేవలం ఎల్‌పీజీ మాత్రమే కాకుండా హైడ్రోకార్బన్, లిథియం వంటి కీలక ఖనిజాల రంగంలో కూడా భారత్‌తో కలిసి పనిచేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Argentina
India Argentina relations
LPG imports India
Bahia Blanca Port
Dahej Port
Mariano Agustin Casino
Gulf crisis
Energy imports India
Hydrocarbon
Lithium

More Telugu News