ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

PM Modi announces Rs 2 lakh compensation for AP bus accident victims
  • మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • టిప్పర్‌ను ఢీకొని మంటలు వ్యాపించిన ప్రైవేట్ బస్సు
  • ప్రమాదంలో 12 మంది సజీవ దహనం.. మ‌రో 22 మందికి గాయాలు
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయ‌ప‌డిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించిన పీఎంఓ
ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు.

"ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి" అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) 'ఎక్స్‌'లో వెల్లడించింది.
Go Back to Shorts
PM Modi
Narendra Modi
Andhra Pradesh bus accident
Markapuram
Road accident
Bus fire
PMNRF
Accident compensation
India road safety

More Telugu News