స్పీకర్ ట్రైబ్యునల్, ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

  • కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌లకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టుకు బీఆర్ఎస్
  • బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు
  • స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని కోరిన బీఆర్ఎస్
తెలంగాణ స్పీకర్ ట్రైబ్యునల్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో స్పీకర్ ట్రైబ్యునల్‌తో పాటు అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.

పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలపై సభాపతి ట్రైబ్యునల్ చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి మారారని కోర్టుకు తెలిపారు.

అయినప్పటికీ స్పీకర్ చర్యలు తీసుకోలేదని అన్నారు. స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే పార్టీ మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది.

Gaddam Prasad Kumar
Telangana High Court
BRS Petition
Kadiyam Srihari
Sanjay Kumar
Telangana Speaker Tribunal

More Telugu News