హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

  • భారతీయ సంస్కృతిలో రామాయణానికి విశిష్టత ఉందన్న గవర్నర్
  • ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అన్న గవర్నర్
  • ఐకమత్యం, భక్తిభావనకు శోభాయాత్ర నిదర్శనమని వ్యాఖ్య
హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్రను ప్రారంభించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి నగరంలో శ్రీరామ శోభాయాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

భారతీయ సంస్కృతిలో రామాయణానికి చాలా విశిష్ఠత ఉందని అన్నారు. ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడుగా శ్రీరాముడిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఐకమత్యం, భక్తిభావనకు శోభాయాత్ర నిదర్శనంగా నిలుస్తోందని గవర్నర్ అన్నారు.

Shiva Pratap Shukla
Sri Rama Navami
Hyderabad
Shobha Yatra
Seetharambagh Temple
Hanuman Vyayamshala

More Telugu News