పెట్రోల్, డీజిల్‌పై సుంకాల తగ్గింపు.. ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు

  • పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై పూర్తిగా ఎక్సైజ్ సుంకం రద్దు
  • సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయమన్న లోకేశ్
  • ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎన్డీఏ నిరూపించుకుందని ప్రశంస
పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేలా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

"పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించిన ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌‌కు రూ.10 తగ్గించారు, డీజిల్ ‌పై పూర్తిగా రద్దు చేశారు. ప్రజలకు ఉపశమనం కలిగించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎన్డీఏ నిరూపించుకుంది. ఇంధన కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే... పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నుంచి ప్రజలకు ఉరటనిస్తూ ఇంధన ధరలు పెరగకుండా భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన ప్రధాని మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.


Nara Lokesh
Andhra Pradesh
Petrol price
Diesel price
Excise duty cut
Narendra Modi
Central Government
Fuel prices
AP IT Minister
Fuel tax

More Telugu News