క్షిపణిపై "భారత ప్రజలకు కృతజ్ఞతలు" అంటూ రాసి ఇజ్రాయెల్ పై ప్రయోగించిన ఇరాన్

  • ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఖండిస్తూ ఇరాన్‌కు సంఘీభావం తెలిపిన దేశాలకు టెహ్రాన్ కృతజ్ఞతలు
  • భారత్‌తో పాటు జర్మనీ, పాకిస్థాన్, స్పెయిన్ దేశాలకు ధన్యవాదాలు తెలిపిన ఇరాన్
  • సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ 
"భారతదేశ ప్రజలకు ధన్యవాదాలు" అంటూ ఇరాన్ వినూత్నరీతిలో కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికా దాడులను ఖండిస్తూ ఇరాన్‌కు సంఘీభావం తెలిపిన దేశాలకు టెహ్రాన్ కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌తో పాటు జర్మనీ, పాకిస్థాన్, స్పెయిన్ దేశాలకు ధన్యవాదాలు తెలిపింది. క్షిపణిపై వివిధ దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశం రాసి, దానిని ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియా హ్యాండిల్ తన 'ఎక్స్' ప్లాట్‌ఫామ్‌పై ఈ పోస్టును పంచుకుంది. అందులో "అమెరికా మరియు ఇజ్రాయెల్‌పై 83వ విడత క్షిపణి దాడులతో ప్రతిస్పందిస్తున్నాం. ఇలాంటి సమయంలో తమ మద్దతు, సంఘీభావం తెలిపినందుకు స్పెయిన్, పాకిస్థాన్, భారతదేశం, జర్మనీ ప్రజలకు ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ తరపున కృతజ్ఞతలు" అని పేర్కొంది.

Iran
Israel
India
missile attack
Tehran
Islamic Republic Consulate General
Germany
Pakistan

More Telugu News