మాజీ మంత్రి భర్త విచిత్ర లీలలు.. షాక్‌లో ట్రంప్, దిగ్భ్రాంతిలో కుటుంబం
- మాజీ మంత్రి క్రిస్టీ నోయెమ్ భర్త బ్రయాన్ నోయెమ్ బాగోతం బట్టబయలు
- మహిళా వేషధారణలో, నకిలీ వక్షోజాలతో ఉన్న ఫోటోల లీక్
- డైలీ మెయిల్ కథనంతో వెలుగులోకి సంచలన విషయాలు
- ఈ ప్రవర్తనను ధ్రువీకరించిన కుటుంబం
- తీవ్ర దిగ్భ్రాంతిలో క్రిస్టీ నోయెమ్
- ఆశ్చర్యం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా రాజకీయాల్లో, ముఖ్యంగా వాషింగ్టన్ డీసీలో ఒక సంచలన కుంభకోణం వెలుగుచూసింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మాజీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ భర్త బ్రయాన్ నోయెమ్.. మహిళా వేషధారణలో (క్రాస్ డ్రెస్సింగ్) ఉన్న ఫోటోలు బయటకు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆన్‌లైన్‌లో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డైలీ మెయిల్ ప్రచురించిన ఒక సంచలన కథనం ప్రకారం.. ఇన్సూరెన్స్ రంగంలో ప్రముఖుడైన 56 ఏళ్ల బ్రయాన్ నోయెమ్ తన భార్య పదవిలో ఉండగా ఆన్‌లైన్‌లో పలువురు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. హాట్ పింక్ రంగు అండర్ వేర్, నకిలీ వక్షోజాలతో ఉన్న ఆయన ఫొటోలను ఈ నివేదిక బయటపెట్టింది. ముగ్గురు పిల్లల తండ్రి అయిన బ్రయాన్, అపరిచితులతో అభ్యంతరకరమైన ఫొటోలను పంచుకున్నారని కథనం పేర్కొంది.
గత మార్చిలో డొనాల్డ్ ట్రంప్.. క్రిస్టీ నోయెమ్‌ను పదవి నుంచి తొలగించారు. తన భర్త చర్యల వల్ల తాను బ్లాక్‌మెయిల్‌కు గురయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. "ఈ ఘటనతో కుటుంబం షాక్‌కు గురైంది. ఈ సమయంలో మాకు ప్రైవసీ కావాలి. మా కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాం" అని నోయెమ్ కుటుంబ ప్రతినిధి తెలిపారు.
ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బ్రయాన్ ప్రవర్తనను కుటుంబం ధ్రువీకరించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "నిజంగా వారు ధ్రువీకరించారా? వావ్, అది నిజమైతే ఆ కుటుంబం పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది. ఇది చాలా విచారకరం" అని డైలీ మెయిల్‌తో అన్నారు. ఈ విషయం గురించి తనకు ముందే ఏమీ తెలియదని కూడా ఆయన స్పష్టం చేశారు.