సరికొత్త చరిత్ర... రాయదుర్గంలో ఎకరా రూ.237 కోట్లు!

TGIIIC land auction Acre sold for Rs 237 crore in Rayadurgam
  • టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర పలికిన ధర
  • పాన్ మక్తాలోని సర్వే నెంబర్‌లోని 6 ఎకరాల 29 గుంటలకు వేలం
  • వేలంలో భూమిని దక్కించుకున్న గౌర వెంచర్స్
హైదరాబాద్ నగరంలో భూమి మరోసారి రికార్డు ధర పలికింది. టీజీఐఐసీ వేలంలో ఎకరా భూమి రూ.237 కోట్లు పలికి సరికొత్త రికార్డును సృష్టించింది. రాయదుర్గంలోని పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం వేశారు. ఈ క్రమంలో టీజీఐఐసీ భూముల వేలానికి అనూహ్య స్పందన లభించింది.

ఈ వేలంలో భూమిని గౌర వెంచర్స్ దక్కించుకుంది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఆరోజు 7 ఎకరాలకు రూ.1,357.59 కోట్లు వచ్చింది.

టీజీఐఐసీ వేలం వేసే భూములు మంచి డిమాండ్ ఉంటోంది. సర్వే నెంబర్ 83/1లోని ప్లాట్ 1ఏ, 1ఎఫ్‌లోని 6.29 ఎకరాలు, ప్లాట్ నెంబర్ పీ4లోని 5.09 ఎకరాలు సహా మొత్తం 11.38 ఎకరాల భూమి వేలానికి నోటిఫికేషన్ వచ్చింది. ఎకరాకు రూ.139 కోట్ల ధరను నిర్ధారించారు. ఈ వేలం ద్వారా రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని టీజీఐఐసీ అంచనా వేస్తోంది. ప్లాట్ నెంబర్ పీ4లోని భూములకు జూన్ 1న ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు.
Go Back to Shorts
TGIIIC
Hyderabad land auction
Rayadurgam land price
Goura Ventures
Pan Maktha
Telangana land records
Real estate Hyderabad
Land value increase

More Telugu News