రామ్ చరణ్ అభిమానిని గాల్లోకి లేపి అవతలికి మోసుకెళ్లిన బాడీగార్డ్ కెవిన్... వీడియో వైరల్
- రామ్ చరణ్ బాడీగార్డ్ వీడియో వైరల్
- విజయవాడ ఈవెంట్లో ఆసక్తికర ఘటన
- చరణ్ వద్దకు దూసుకొచ్చేందుకు యత్నించిన అభిమాని
- అభిమానిని గాల్లోకి లేపి పక్కకు తీసుకెళ్లిన కెవిన్ కుంటా
- సోషల్ మీడియాలో వైరల్గా మారిన కెవిన్ వీడియో
- కెవిన్ బలానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
ఓవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉండగా, జనాలేమో అతడ్ని అంటిపెట్టుకుని తిరుగుతున్న సూపర్ బాడీగార్డ్ కెవిన్ కుంటా గురించి తెలుసుకునేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్ లో ఇప్పుడు కెవిన్ కుంటా అని టైప్ చేస్తే చాలు... అతడి గురించి బోలెడన్ని విశేషాలు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా, కెవిన్ కుంటా వీడియో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.
నిన్న విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కూర్చుని ఉండగా, ఓ అభిమాని అతడి వద్దకు దూసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో, ఎక్కడ్నించి వచ్చాడో కానీ కెవిన్ కుంటా మెరుపువేగంతో వచ్చి ఆ అభిమానిని అమాంతం గాల్లోకి లేపి, మోసుకొని వెళ్లి కాస్త అవతల దింపేశాడు. చూసినవాళ్లంతా అతడి బలాన్ని చూసి వామ్మో అనుకున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టే రామ్ చరణ్ అతడిని ఏరికోరి మరీ బాడీగార్డ్ గా నియమించుకున్నాడని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.