క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో భారత్‌కే ఆఫ్ఘనిస్థాన్ ఆతిథ్యం!
- సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్
- భారత గడ్డనే ‘హోమ్ గ్రౌండ్’గా వాడుకోనున్న ఆఫ్ఘనిస్థాన్
- బీసీసీఐ, ఏసీబీల మధ్య బలమైన సంబంధాలకు ఇది నిదర్శనం
- ఈ నెలలో టెస్టు, వన్డే సిరీస్ కోసం ఆఫ్ఘన్ జట్టు భారత పర్యటన
క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, ఆసక్తికరమైన ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు తొలిసారిగా టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే విశేషం ఏమిటంటే.. ఈ చారిత్రక ‘హోమ్’ సిరీస్‌కు వేదికగా నిలవబోయేది కూడా భారత దేశమే. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.
బీసీసీఐ, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాల నేపథ్యంలో ఈ సిరీస్ సాధ్యమవుతోంది. రిటర్న్ టూర్‌లో భాగంగా ఈ సిరీస్‌ను నిర్వహించాలని ఏసీబీ చేసిన ప్రతిపాదనకు బీసీసీఐ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇరు బోర్డుల మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందని, లాంఛనాలు పూర్తయిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే వంటి బోర్డులకు ఆర్థికంగా, క్రీడాపరంగా అండగా నిలిచేందుకు బీసీసీఐ గతంలోనూ ఇటువంటి సిరీస్‌లు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సిరీస్ కోసం వేదికను ఖరారు చేసేందుకు బీసీసీఐయే చొరవ తీసుకుని ఏసీబీ, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) మధ్య చర్చలు జరిపింది. సెప్టెంబర్ 13, 16, 19 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం డీడీసీఏ తమ స్థానిక ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 షెడ్యూల్‌ను కూడా సర్దుబాటు చేస్తోంది.
స్వదేశంలో రాజకీయ అస్థిరత, భద్రతా కారణాల వల్ల ఆఫ్ఘనిస్థాన్ గత దశాబ్ద కాలంగా తమ అంతర్జాతీయ ‘హోమ్’ మ్యాచ్‌లను భారత్, యూఏఈలలో ఆడుతోంది. గతంలో 2017లో ఐర్లాండ్‌తో గ్రేటర్ నోయిడాలో, 2018లో బంగ్లాదేశ్‌తో డెహ్రాడూన్‌లో సిరీస్‌లు ఆడింది.
జూన్‌లో మరో పర్యటన
ఇదిలా ఉంటే.. ఈ టీ20 సిరీస్ కంటే ముందే ఆఫ్ఘన్ జట్టు మరో సుదీర్ఘ పర్యటన కోసం భారత్‌కు రానుంది. జూన్ 6 నుంచి 20 మధ్య ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ రెండు ఫార్మాట్లలోనూ హష్మతుల్లా షాహిదీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జూన్ 6న న్యూ చండీగఢ్‌లో ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరగనున్నాయి.