మమత పార్టీకి భారీ షాక్.. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్?

Trinamool Split Wide Open
  • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి చీలిక ముప్పు
  • మహారాష్ట్ర శివసేన తరహా పరిణామాలు ఖాయమంటున్న నేతలు
  • మమత సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు, ఇద్దరిపై వేటు
  • పార్టీ గుర్తు కోసం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్న అసమ్మతి వర్గం!
పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం చెలరేగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో చీలిక ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన పార్టీకి ఎదురైన సంక్షోభంలాంటి పరిస్థితే ఇక్కడా పునరావృతం కానుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమి, పార్టీ అంతర్గత పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.

పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పిలిచిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 20 మంది మాత్రమే హాజరవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఇది పార్టీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. మరోవైపు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో జూన్ 1న ఇద్దరు ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో అసంతృప్తి మరింత పెరిగింది.

టీఎంసీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ మంత్రి తపస్ రాయ్ మాట్లాడుతూ, టీఎంసీ చీలిక దిశగా పయనిస్తోందని, అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తు కోసం సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీని కొందరు హైజాక్ చేశారని బహిష్కృత నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ పరిణామాలపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కోల్‌కతాలో తన పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మమతా బెనర్జీ భారీ ధర్నా నిర్వహించారు. "నేను పోరాడతాను లేదా చస్తాను" అని తేల్చి చెప్పారు. తమ పార్టీని బలహీనపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
Go Back to Shorts
Sena Model In Bengal
Trinamool Split Wide Open

More Telugu News