'పెద్ది' ట్రైలర్ పై విమర్శలు... వివరణ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు
- పెద్ది ట్రైలర్‌పై వస్తున్న స్పందన మీద దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ
- కథను దృష్టిలో పెట్టుకుని 50 నిమిషాల ఫుటేజ్ దాచేశామన్న దర్శకుడు
- జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న 'పెద్ది'
- రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా
- విజయవాడలో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'పెద్ది' జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. అయితే, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మిశ్రమ స్పందనలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమాలోని కీలకమైన సన్నివేశాలు బయట రాకూడదనే ఉద్దేశంతో, ట్రైలర్లో కొన్ని అంశాలను పరిమితంగా చూపించామని స్పష్టం చేశారు. "కథలో ఉన్న ముఖ్యమైన పాయింట్ బయటపెడితే సినిమా చూసేటప్పుడు ఆ మజా పోతుంది. అందుకే సుమారు 50 నిమిషాల కీలకమైన ఫుటేజ్‌ను ట్రైలర్ కోసం వాడలేదు. ఆ కంటెంట్ చేర్చకపోవడం వల్లే, మేము చెప్పాలనుకున్నది ట్రైలర్ లో పూర్తిగా చెప్పలేకపోయాం" అని బుచ్చిబాబు వివరించారు.
కొన్నిసార్లు యావరేజ్ ట్రైలర్లు ఉన్న సినిమాలు కూడా థియేటర్లలో అద్భుత విజయం సాధించాయని, తమ సినిమా కూడా అదే కోవలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కథను ఎక్కువగా చెబితే అసలు విషయం తెలిసిపోతుందని అన్నారు.
'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. ఇందులో రామ్ చరణ్ బహుముఖ ప్రజ్ఞావంతుడైన అథ్లెట్‌గా, సామాజిక నాయకుడిగా కనిపించనున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.
నిన్న జూన్ 1న విజయవాడలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు చిత్ర బృందం కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.