కోల్‌కతా కాలేజీలో చెదలు పట్టిన నోట్ల కట్టల కలకలం.. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది?

Termite Infested Cash Found In Kolkata College
  • కోల్‌కతా సురేంద్రనాథ్ కాలేజీలో నగదు లభ్యం
  • రూ.లక్ష విలువ చేసే నోట్లకు చెదలు
  • కాలేజీలో బయటపడిన రహస్య గది
  • ఆ గదిలో ఏసీ, బెడ్ 
  • విలాసవంతమైన రూమ్‌లో తుపాకీ
కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కాలేజీ యూనియన్ రూమ్‌లో ఊహించని ఘటన వెలుగు చూసింది. వర్షాకాలం వస్తుండటంతో కాలేజీ ప్రాంగణాన్ని శుభ్రం చేసే పనులు చేపట్టారు. అందులో భాగంగా యూనియన్ రూమ్‌లోని ఓ పాత అల్మారాను తీసి చూశారు. అందులో ఉన్న రెండు సూట్‌కేసులను తెరిచిన కార్మికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ పెట్టెల నిండా రూ.100, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి.

చెదలు పట్టిన కరెన్సీ
సూట్‌కేసుల్లో దొరికిన డబ్బు మొత్తం రూ.లక్ష కంటే ఎక్కువే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ నోట్లన్నీ చాలా కాలం నుంచి అలాగే ఉండటం వల్ల వాటికి పూర్తిగా చెదలు పట్టేశాయి. నోట్లన్నీ పాడైపోయి ముక్కలుగా మారిపోయాయి. ఆ నోట్ల వివరాలను నోట్ చేసుకుంటున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

దొరికిన రహస్య బెడ్‌రూమ్
నోట్ల కట్టలు దొరికిన మరుసటి రోజే అదే కాలేజీలో మరో షాకింగ్ విషయం బయటపడింది. బిల్డింగ్ పైకప్పుపైకి వెళ్లే దారిలో ఒక ‘రహస్య గది’ని అధికారులు కనుగొన్నారు. అది ఒక విలాసవంతమైన బెడ్‌రూమ్‌లా ఉంది. అందులో ఏసీ, మంచం, గోడలపై ఖరీదైన పెయింటింగ్స్ ఉన్నాయి. దానికి అటాచ్డ్‌గా అధునాతన బాత్‌రూమ్ కూడా ఉంది. ఆ రూమ్‌లో ఒక తుపాకీ కూడా దొరకడం తీవ్ర కలకలం రేపింది.

టీఎంసీపై ఆరోపణలు
ఆ రహస్య గది, సూట్‌కేస్ డబ్బుల వెనుక తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడి హస్తం ఉందని బీజేపీ ఎమ్మెల్యే సజల్ ఘోష్ ఆరోపించారు. కాలేజీ రూమ్‌లో అంత డబ్బు, తుపాకీ ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన సదరు లీడర్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనలపై కాలేజీ యాజమాన్యం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Go Back to Shorts
College
Kolkata
West Bengal
Termite Infested Cash
TMC

More Telugu News