త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్?
- రెండు స్థానాల నుంచి గెలుపొందిన విజయ్
- తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన దళపతి
- ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందంటూ తొలి నుంచి ప్రచారం
- తిరుచ్చి ఈస్ట్ రేసులో బలంగా వినిపిస్తున్న లారెన్స్ పేరు
- తొలి నుంచి విజయ్‌కి గట్టి మద్దతుదారుడిగా ఉన్న లారెన్స్
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సరికొత్త సమీకరణాలతో హీటెక్కుతున్నాయి. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ హిట్ విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ... ఇప్పుడు రాబోయే ఉపఎన్నికపై పూర్తి ఫోకస్ పెట్టింది. విజయ్ తాను గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ బైపోల్ అనివార్యమైంది.
అయితే, ఈ స్థానం నుండి టీవీకే అభ్యర్థిగా ఎవరు నిలబడబోతున్నారనే దానిపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడేలా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు ఇప్పుడు తిరుచ్చి ఈస్ట్ రేసులో అత్యంత బలంగా వినిపిస్తోంది.
అయితే, రాజకీయాల్లోకి వచ్చే ఈ కీలక నిర్ణయంపై లారెన్స్ ఇప్పటికే తన గురువు, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. తలైవా రజినీకాంత్ ఇచ్చే సలహాలు, ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాతే లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.