జపాన్ లైఫ్‌పై భారతీయుడి ఇన్‌స్టా వీడియో వైరల్!
- జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్ పూర్వ విద్యార్థి వీడియో
- పదేళ్లుగా జపాన్‌లో ఉంటున్న అంకిత్ పురోహిత్
- వాయు కాలుష్య ఎప్పుడూ 50 లోపేనని వెల్లడి
- రవాణా వ్యవస్థలో అద్భుత సమయపాలన
- ఓవర్‌టైమ్ పనికి అదనపు జీతం లభిస్తుందని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి జపాన్ అనగానే అందమైన చెర్రీ బ్లాసమ్స్, పరిశుభ్రమైన రోడ్లు, వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లే గుర్తొస్తాయి. అయితే పర్యాటకానికే కాకుండా రోజువారీ జీవనానికి, ఉద్యోగాలకు కూడా జపాన్ అద్భుతమైన దేశమని ఐఐఎం కాశీపూర్ పూర్వ విద్యార్థి, భారతీయ టెక్కీ అంకిత్ పురోహిత్ స్పష్టం చేస్తున్నారు. గత పదేళ్లుగా జపాన్‌లోనే స్థిరపడిన ఆయన.. అక్కడి జీవన నాణ్యత ఎందుకు టాప్‌లో ఉంటుందో వివరిస్తూ ఇన్‌స్టాలో పంచుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియోకు ఆయన ‘జపాన్‌లో నివసించడం వల్ల నష్టాలు’ అని క్యాప్షన్ ఇచ్చి.. లోపల మాత్రం అక్కడి అద్భుతమైన ప్రయోజనాలను వివరించడం విశేషం. అంకిత్ పంచుకున్న వివరాల ప్రకారం.. జపాన్‌లో వాయు కాలుష్య సూచీ ఎప్పుడూ 50 కంటే తక్కువగానే ఉంటుంది. కాలుష్య కోరల్లో చిక్కుకునే భారతీయులకు ఈ స్వచ్ఛమైన గాలి గొప్ప వరమని పేర్కొన్నారు. అలాగే అక్కడి ప్రజా రవాణా వ్యవస్థ చాలా కచ్చితత్వంతో పనిచేస్తుందన్నారు. ఆఫీస్‌కు లేట్ అవుతుందనే భయమే ఉండదని చెప్పారు.
రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కూడా ప్రజలంతా ఎంతో నిశ్శబ్దంగా, నెమ్మదిగా మాట్లాడుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తారని అంకిత్ వివరించారు. ఇక జపాన్ అనగానే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే ప్రచారం ఉంది. కానీ అంకిత్ మాత్రం దాన్ని కొట్టిపారేశారు. అక్కడ ఆఫీస్‌కు వెళ్లడం అస్సలు ఒత్తిడిగా అనిపించదని, ఉద్యోగులు అదనంగా పనిచేసే ప్రతి గంటకు, అలాగే సెలవు రోజుల్లో పనిచేస్తే దానికి తగినట్లుగా కంపెనీలు అదనపు వేతనాన్ని చెల్లిస్తాయని తెలిపారు.
మనం కట్టే పన్నులకు తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి అత్యుత్తమ వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ప్రజా భద్రత, పౌర సేవలు అందుతాయని అంకిత్ పేర్కొన్నారు. స్వచ్ఛమైన పర్యావరణం, నమ్మకమైన రవాణా, న్యాయమైన పని విధానాలు, నాణ్యమైన ప్రజా సేవలు జపాన్‌ను ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు గల దేశంగా నిలబెట్టాయని ఈ భారతీయ టెక్కీ స్పష్టం చేశారు.