కామారెడ్డి జిల్లాలో విషాదం.. నదిలో దిగి ముగ్గురి మృతి
- కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో ఘోర ప్రమాదం
- స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
- మృతులు అనిత (40), పావని (14), శివాని (13)గా గుర్తింపు
- ప్రమాదం నుంచి ఒకరిని సురక్షితంగా కాపాడిన స్థానికులు
- ఎల్లమ్మ గుడికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లగా ఘటన
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాన్సువాడ మండల పరిధిలో శుక్రవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పిట్లం మండలం మంగళ్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు బాన్సువాడ మండలం బుడిమి సమీపంలోని ఎల్లమ్మ ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లారు. దర్శనం అనంతరం దగ్గరలోని మంజీరా నదిలో పుణ్యస్నానం చేసేందుకు దిగారు. అయితే, నీటి లోతు, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారు అదుపుతప్పి గల్లంతయ్యారు.
వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భాను ప్రసాద్ అనే వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. కానీ, అప్పటికే అనిత (40), ఆమె కుమార్తెలు పావని (14), శివాని (13) నీట మునిగి మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మరణించడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.