యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక
- పార్లమెంట్లో బాధితుల వాంగ్మూలాలు చదివిన ఎంపీ
- దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత లైంగిక దాడులు
- మతం, జాతి ఆధారంగా బాలికలపై వేధింపులు
- పోలీసులపైనా బాధితురాలి రేప్ ఆరోపణలు
- నివేదిక విడుదలకు సిద్ధం.. తక్షణ చర్యలకు డిమాండ్
బ్రిటన్ను దశాబ్దాలుగా కుదిపేస్తున్న 'గ్రామింగ్ గ్యాంగ్స్' (వ్యవస్థీకృత బాలల లైంగిక వేధింపుల ముఠాలు) వివాదంపై బ్రిటిష్ ఎంపీ రూపెర్ట్ లోవ్ పార్లమెంట్లో చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. ఒక స్వతంత్ర రేప్ గ్యాంగ్ విచారణ కమిటీ సేకరించిన బాధితుల అత్యంత భయానక, బాధాకరమైన వాంగ్మూలాలను ఆయన హౌస్ ఆఫ్ కామన్స్‌లో చదివి వినిపించారు. ఈ క్రూరమైన దాడుల గురించి ప్రపంచమంతా వినాలని, ఇప్పటికైనా ఎంపీలంతా కేవలం చర్చలతో సరిపెట్టకుండా బాధితుల కోసం తక్షణమే రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎంపీ లోవ్ గత ఏడాది జరిపిన ఒక ప్రైవేట్ పరిశోధనలో బ్రిటన్‌లోని కనీసం 85 ప్రాంతాలలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దశాబ్దాలుగా క్రియాశీలంగా ఉన్న ఈ రేప్ గ్యాంగులలో ప్రధానంగా పాకిస్ధానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నారని, ప్రభుత్వ యంత్రాంగాల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ అరాచకాలు ఇంతలా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు.
ఎంపీ లోవ్ చదివిన నివేదికలలో బాధితులు తాము ఎదుర్కొన్న నరకాన్ని వివరించారు. ఒక బాధితురాలు తాను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనపై అత్యాచారం చేసి, ఆపై ఖాళీ మద్యం సీసాతో అంతర్గత అవయవాలు దెబ్బతినేలా దాడి చేశాడని పేర్కొంది. మరొక బాధితురాలు తను 13 ఏళ్ల వయసు నుంచి మూడు సంవత్సరాల పాటు దాదాపు 600 నుండి 700 మంది వేర్వేరు పురుషుల చేతిలో అత్యాచారానికి గురయ్యానని వాపోయింది. పండుగలు, ఈద్ (రంజాన్) సెలవుల సమయంలో ఈ దాడులు, పార్టీలు మరింత హింసాత్మకంగా మారేవని వివరించింది. అంతేకాకుండా, కొందరు నిందితులు బాధితులను మానసికంగా దెబ్బతీయడానికి మతాన్ని, జాతిని కూడా వాడుకున్నట్లు సాక్ష్యాలు చెబుతున్నాయి. శ్వేతజాతీయులు, క్రైస్తవ బాలికలకు నైతిక విలువలు తక్కువని, ముస్లిం బాలికలకు గౌరవం ఎక్కువని పోలుస్తూ నిందితులు తమను మరింత అవమానించి నియంత్రించేవారని, మెడలో ఉన్న సిలువ (క్రాస్) గుర్తులను లాగేసి 'ఇప్పుడు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? నిన్ను వదిలేశాడా?' అంటూ ఎగతాళి చేసేవారని బాధితులు వాపోయారు.
ఈ అరాచకాలపై ప్రభుత్వ విభాగాలు, వైద్య సిబ్బంది, చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు చేష్టలుడిగి చూశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక బాధితురాలు తాను తీవ్ర రక్తస్రావంతో 15 ఏళ్ల వయసులో ఆసుపత్రికి వెళ్లినప్పుడు, భయంతో నిజం చెప్పలేకపోయినా అక్కడి సిబ్బంది కనీసం ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేవలం టాబ్లెట్లు ఇచ్చి పంపించేశారని తెలిపింది. అన్నిటికంటే భయంకరంగా, ఒక మహిళ తనపై దేశంలోని వివిధ ప్రాంతాలలో పలువురు పోలీసు అధికారులే అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. వేరొక సాక్ష్యంలో, దాదాపు 15 నుంచి 20 మంది మహిళలను పంజరాలలో బంధించి ఉంచడాన్ని తాను చూశానని, పురుషులు చుట్టూ నిలబడి నవ్వుతూ, వీడియోగ్రాఫ్ చేస్తూ బెట్టింగ్‌లు కాస్తుండగా ఒక కుక్కతో కూడా తనపై అత్యాచారం చేయించారని ఒక బాధితురాలు పేర్కొంది. ఈ దారుణాలన్నింటినీ అడ్డుకోవడంలో వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి.
బ్రిటన్‌లో 'గ్రామింగ్ గ్యాంగ్స్' అనే పదం బలహీన వర్గాలకు చెందిన, ముఖ్యంగా సమస్యాత్మక నేపథ్యాలు కలిగిన 11 నుంచి 16 ఏళ్ల వయసు గల బాలికలను ముఠాలుగా ఏర్పడి మభ్యపెట్టడం, డ్రగ్స్ లేదా మద్యం అలవాటు చేయడం, ఆపై బ్లాక్మెయిల్ చేస్తూ ఒకరి నుంచి మరొకరికి మారుస్తూ సాగించే లైంగిక దోపిడీని సూచిస్తుంది. రోథర్హామ్, రోచ్డేల్, ఓల్డ్హామ్ వంటి పలు పట్టణాలలో గతంలో జరిగిన దర్యాప్తుల్లో ఈ ఘోరాలు వెలుగుచూశాయి. 2002లో లేబర్ పార్టీ ఎంపీ ఆన్ క్రైర్ తొలిసారిగా ఈ అంశాన్ని లేవనెత్తగా, 2010లో రోథర్హామ్లో ఐదుగురు పురుషులు శిక్షకు గురయ్యారు. తదనంతరం ఒక పత్రిక జరిపిన పరిశోధనలో బ్రిటీష్-పాకిస్థానీ పురుషుల వ్యవస్థీకృత నెట్వర్క్ దీని వెనుక ఉన్నట్లు బయటపడింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ రేప్ గ్యాంగ్‌లపై పూర్తి విచారణ నివేదిక విడుదల కానుందని, ఇది బ్రిటన్‌లో శాశ్వత మార్పును తెస్తుందని ఎంపీ లోవ్ పార్లమెంట్‌కు స్పష్టం చేశారు.