రూపాయి విలువను కాపాడడానికి ఆర్బీఐ బంగారం అమ్మిందా? ఇదీ అసలు నిజం!
- బంగారం అమ్మలేదని ప్రకటించిన ఆర్బీఐ
- ఇదే విషయాన్ని స్పష్టం చేసిన కేంద్రం
- బ్లూమ్‌బెర్గ్ నివేదికలో నిజం లేదని స్పష్టీకరణ
- దేశంలో 880 టన్నుల బంగారం ఉన్నట్లు వెల్లడి
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పడిపోతున్న రూపాయి విలువను కాపాడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు ఏకంగా 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. అయితే అంతర్జాతీయంగా వైరల్ అవుతున్న ఈ సంచలన వార్తను కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఖండించాయి.
తప్పుడు వార్తలు
బంగారం నిల్వలను విక్రయించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆర్బీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. తమ వద్ద ఉన్న భౌతిక బంగారు నిల్వలలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దేశంలో 880.52 టన్నుల బంగారం సురక్షితంగా ఉందని, ఇలాంటి విషయాల్లో కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించింది.
పీఐబీ అధికారిక ప్రకటన
కేంద్ర ప్రభుత్వ అధికారిక పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సైతం ఈ నివేదికను కొట్టిపారేసింది. విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా తగ్గలేదని, మరింత పెరిగిందని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 2025 చివరి నాటికి బంగారం వాటా 13.92 శాతంగా ఉండగా, 2026 మార్చి 31 నాటికి అది 16.70 శాతానికి పెరిగిందని గణాంకాలతో సహా వివరించింది. మే 22 నాటికి ఈ వాటా 16.85 శాతానికి చేరినట్లు వెల్లడించింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదికలో ఏముంది?
మే 22తో ముగిసిన రెండు వారాల్లో ఆర్బీఐ సుమారు 12 బిలియన్ డాలర్ల బంగారాన్ని అమ్మి ఉండొచ్చని బ్లూమ్‌బెర్గ్ తన నివేదికలో అంచనా వేసింది. ఆ డబ్బుతో 7.5 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీని కొనుగోలు చేసిందని పేర్కొంది. మార్కెట్లో రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోకుండా కాపాడటానికే ఆర్బీఐ ఈ విక్రయాలు జరిపిందని సదరు సంస్థ రాసుకొచ్చింది. కానీ కేంద్రం మాత్రం ఆ నివేదికను పూర్తిగా తోసిపుచ్చింది.
లండన్ బ్యాంకుల్లో సేఫ్
భారతదేశానికి చెందిన మొత్తం 880.52 మెట్రిక్ టన్నుల బంగారంలో 77 శాతం నిల్వలు ప్రస్తుతం దేశంలోనే భద్రంగా ఉన్నాయి. గత ఆరు నెలల క్రితం వరకు దేశంలో 66 శాతం బంగారం మాత్రమే ఉండేది. మిగిలిన విదేశీ నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి అంతర్జాతీయ బ్యాంకుల్లో భద్రపరిచినట్లు ఆర్బీఐ తన అర్ధవార్షిక నివేదికలో స్పష్టం చేసింది.