ఢిల్లీ అగ్ని ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

Jagan expresses shock over Delhi fire accident
  • ఢిల్లీలోని రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం
  • ప్రమాదంలో 21 మంది దుర్మరణం
  • అత్యంత బాధాకరం అన్న జగన్

ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఒక రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏకంగా 21 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 


అలాగే, ప్రమాదం కారణంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అగ్నిప్రమాద బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలు మరింత కలచివేస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


Go Back to Shorts
Jagan
YSRCP
Delhi Fire Accident

More Telugu News