ఇంగ్లండ్, కివీస్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర చర్చ.. ఇదిగో వీడియో!
- ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీకి భారత జట్టు నుంచి పిలుపు
- ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం
- ఎంపికైతే, అతి పిన్న వయసులో జట్టులోకి వచ్చిన సచిన్ రికార్డు బ్రేక్
- లార్ట్స్ టెస్టులో వైభవ్‌పై ఇంగ్లండ్, కివీస్ మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి, రాజస్థాన్ రాయల్స్ జట్టును ఒంటిచేత్తో నడిపించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కేవలం దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు సైతం ఈ కుర్రాడి ప్రతిభకు ఫిదా అవుతున్నారు. తాజాగా, వైభవ్‌కు భారత సీనియర్ జట్టు నుంచి తొలి పిలుపు అందనుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో వైభవ్ సూర్యవంశీ పేరు ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు పలువురు యువ ఆటగాళ్లను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలో, ఐపీఎల్‌లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన వైభవ్‌కు జట్టులో చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, అతి పిన్న వయసులో భారత జట్టుకు ఎంపికైన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలవుతుంది. ఈ పర్యటనలో టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి.
వైభవ్ ప్రతిభ కేవలం ఐపీఎల్‌కే పరిమితం కాలేదు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగగా, కామెంటరీ బాక్స్‌లో ఇయాన్ వార్డ్, నాజర్ హుస్సేన్, సైమన్ డౌల్ వంటి మాజీ ఆటగాళ్లు వైభవ్‌పై ఆసక్తికర చర్చ జరిపారు. న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ మాట్లాడుతూ.. "అతడు భారత జట్టుకు ఎంపికయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేయడం అద్భుతం. 15 ఏళ్ల వయసులో ఇలాంటి ప్రదర్శనను చూడటం చాలా గొప్పగా ఉంది. అతడి కోసం జట్టులో తప్పకుండా చోటు కల్పించాలి" అని ప్రశంసలు కురిపించాడు. ఈ చర్చతో వైభవ్ క్రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. ఇప్పుడు అందరి దృష్టీ సెలక్షన్ కమిటీ సమావేశంపైనే ఉంది.