ట్రంప్ ‘శాంతిదూత’ అయ్యాడట.. పాక్ ప్రధాని భజన!
- ట్రంప్ జోక్యం వల్లే భారత్‌తో కాల్పుల విరమణ కుదిరిందన్న పాక్ ప్రధాని
- అమెరికా అధ్యక్షుణ్ని శాంతిదూతగా అభివర్ణించిన షరీఫ్
- మూడో దేశం జోక్యం లేదని గతంలోనే కొట్టిపారేసిన భారత్
- నిధుల కోసం పాక్ డ్రామాలంటున్న నిపుణులు
భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. గతేడాది మే 10న భారత్‌తో జరిగిన కాల్పుల విరమణకు ట్రంప్ ‘సమయానుకూల, నిర్ణయాత్మక జోక్యమే’ కారణమని, ఆయన్ను తాము ఎప్పటికీ ‘శాంతిదూత’గా గుర్తుపెట్టుకుంటామని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లోని యూఎస్ ఎంబసీ వేడుకల్లో ఆయన ఈ భజన చేశారు.
ఏప్రిల్‌లో పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం 2025 మే 7న పాక్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. భారత సైన్యం పాక్ గడ్డపైకి దూసుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ఊచకోత కోస్తుంటే.. తట్టుకోలేక పాక్ ఆర్మీ చేతులెత్తేసింది. ఆ దెబ్బకు తాళలేక పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్వయంగా భారత సైనిక అధికారులకు ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు.
కానీ ఈ క్రెడిట్ మొత్తాన్ని ట్రంప్ తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే. మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపేశానని, ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను ఆపానంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీనికి పాక్ ప్రధాని కూడా అవునంటూ తలాడిస్తున్నారు. వీరిద్దరికీ భారత విదేశాంగ శాఖ గతంలో గట్టిగానే చెక్ పెట్టింది. ఈ వ్యవహారంలో అసలు మూడో దేశ ప్రమేయమే లేదని, పాక్ సైన్యమే స్వయంగా కాల్పుల విరమణ కోరిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.